Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. ఈ తరుణంలో ఓ అడుగు ముందున్న కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు.
ఈ క్రమంలో కుమారుడికి చెందిన వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధ రామయ్య బరిలోకి దిగుతున్నారు. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. మైసూరులోని వరుణ నియోజకవర్గానికి ప్రస్తుతం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన సిద్ధరామయ్య ప్రస్తుతం బాగల్కోట్ జిల్లాలోని బాదామి ఎమ్మెల్యేగా ఉన్నారు.