Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేళ సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ వేశారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) కింద దోషిగా తేలిన ప్రజాప్రతినిధిని ఆటోమేటిక్గా అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపించారు. సంబంధిత సభ్యునిపై ఉన్న నేరాల స్వభావం, తీవ్రతతో సంబంధం లేకుండానే ఆయనపై అనర్హతను అమలు చేయడం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన "ఆటోమేటిక్" అనర్హత పై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.