Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డిస్ క్వాలిఫై చేసినా, జైలులో పెట్టిన భయపడనని, నేను భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాని, తాను సత్యాన్నే మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. నేడు రాహుల్ గాంధీ ప్రేస్ మీట్ లో పాల్గోన్నారు. ఈ తరుణంలో అయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20,000 కోట్లు ఎవరు పెట్టుబడులు పెట్టారని ప్రశ్నించారు. దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ షెల్ కంపెనీల్లో కొన్ని డిఫెన్స్ సంస్థలు ఉన్నాయని, ఎందుకు డిఫెన్స్ అథారిటీ ప్రశ్నించడం లేదని అడిగారు.
అంతే కాకుండా అదానీ కోసం ఎయిర్ పోర్టు రూల్స్ నే మార్చారని ఆరోపించారు. అదానీ, మోడీల స్నేహం గురించి తాను పార్లమెంట్ లో మాట్లాడానని రాహుల్ గాంధీ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. తాను పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని రద్దు చేశారని, దీని తర్వాత లోక్ సభ స్పీకర్ కు వివరణాత్మక సమధానం ఇచ్చినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్రమంత్రులు పార్లమెంట్ లో అబద్దాలు చెప్పారని, విదేశీ శక్తుల నుంచి సహాయం కోరానని ఆరోపించారని కానీ అవేవీ తాను చేయలేదని రాహుల్ గాంధీ అన్నారు. నేను ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు.