Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్, ఏ5 కేతావత్ రాజేశ్వర్లను కస్టడీకి అప్పగించింది. ఈ నలుగురు నిందితులను రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే మిగతా ముగ్గురు నిందితులు ఏ-10, ఏ-11, ఏ-12ల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.