Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం తమ మొత్తం బృందంతో ఆజట్టు ప్రాక్టీస్ చేసింది. ఆటగాళ్లు పలు రకాల షాట్లు ఆడుతూ కనిపించారు. ఆ జట్టు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రాక్టీస్‌లో భారీ షాట్లు ఆడి అభిమానులను అలరించారు.
ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈరోజు తమ జట్టు జెర్సీని విడుదల చేయనుంది. అంతేకాదు ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మాజీ క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్కు చోటు కల్పించనుంది. అంతకాదు వీళ్ల జెర్సీ నంబర్లను(గేల్ 17, డివిల్లియర్స్ 333) మరెవరికీ కేటాయించకూడదని కూడా ఫ్రాంఛైజీ నిర్ణయించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.