Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు అసియా ఛాంపియన్షిప్ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది.
దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించారు. గతేడాది 52 కేజీల విభాగంలో పసిడి దక్కించుకున్న నిఖత్.. ఈసారి 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుసుకొని చరిత్ర సృష్టించారు. శనివారం భారత్ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగం నీతు గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్ (మంగోలియా)ను చిత్తుచేయగా.. మరోవైపు 81 కేజీల విభాగం టైటిల్ పోరులో స్వీటీ 4-3తో వాంగ్ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది.