Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో కూడా రిజిస్టర్ చేయించామని వెల్లడించారు ముఖ్యమంత్రి. తమ ప్రాంతంలో సభ పెట్టాలని కోరుతూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు కేసీఆర్. తర్వాతి సభను షోలాపూర్ లో పెడతామని కేసీఆర్ వెల్లడించారు. నాందేడ్ లో తాము సభ పెట్టిన వెంటనే రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ చేశారని బీఆర్ఎస్ సభ సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని వ్యక్తపరిచారు
దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోందని కేసీఆర్ అన్నారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించి చేసిందేమీ లేదని సీఎం కెసిఆర్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టే మహారాష్ట్రలో సాగు, తాగు నీరు చాలా చోట్ల అందుబాటులో లేదని అన్నారు ఆయన. పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మాత్రం మారడం లేదని తెలిపారు. ఉల్లి, చెరుకు ధర కోసం రైతులు ప్రతిఏటా పోరాడాల్సిందేనని మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలో అమలయ్యేంత వరకు తాను ఇక్కడకు వస్తూనే ఉంటానని తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత ఫడ్నవిస్ కు, తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తే ఇక్కడకు రానేరానని సవాల్ విసిరారు సీఎం కెసిఆర్.