Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తీన్మార్ మల్లన్నకు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. గత మంగళవారం రాత్రి మేడిపల్లి పోలీసులు, ఎస్వోటీ పోలీసులు కలిసి ఫిర్జాదిగూడ-వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో మరికొంత మంది సివిల్ డ్రెస్‌లో ఉన్న ఎస్వోటీ పోలీసులు అక్కడికి కొద్దిదూరంలో కటాఫ్ డ్యూటీ చేస్తున్నారు. అదే ప్రాంతంలో క్యూ న్యూస్ ఉండడంతో తమ కార్యాలయం ముందు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తునట్లు అనుమానించి కొంతమంది పోలీసులను బెదిరించి గదిలో బంధించారు. సమాచారం తెలిసి అక్కడే విధుల్లో ఉన్న మరో పోలీస్ బృందం క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి బందీలుగా ఉన్న సిబ్బందిని తమ విడిపించుకోవడంతోపాటు పోలీసులని తెలిసీ దాడిచేసిన క్యూ న్యూస్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో తీన్మార్ మల్లన్న కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఆరుగురు అరెస్టు కాగా మరో ఇద్దరు పరారయ్యారన్నారు. ఎస్వోటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీమ్‌పై 363 ,342, 395, 332, 307 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 7 (1) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హయత్‌నగర్ మునుగానూర్ ద్వారక నగర్‌లోని మేజిస్ట్రేట్ ఇంటి వద్ద తీన్మార్ మల్లన్న మరికొందరిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జ్ మల్లన్నకు 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో మల్లన్నతో పాటు మరో నలుగురిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.