Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశవ్యాప్తంగా నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దాడులు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 18 కంపెనీలు రద్దు చేయడంతో పాటు 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ఫార్మా కంపెనీలపై దాడులు జరగొచ్చని గత 15 రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నకిలీ ఔషధాల తయారీకి సంబంధించి ఈ భారీ దాడులు జరిగాయి. డ్రగ్స్ తయారీకి కేంద్రంగా ఉన్న ఇండియా మందులపై ఇటీవల పరిణామాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గతేడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో ఇండియా తయారీ దగ్గుమందు వాడిన తర్వాత చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో ఈ దగ్గు మందు తయారు చేసిన రెండు కంపెనీలను ప్రభుత్వం మూసేయించింది.