Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండోర్‌లోని ఓ ఐదంతస్తుల హోటల్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి హోటల్లోని రెండు అంతస్తులకు విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. హోటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి యత్నిస్తున్నారు. ఓ మహిళ, ఇద్దరు చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. కాగా, మహారాష్ట్రలోని దాదర్ ఈస్ట్‌లో ఉన్న నైగావ్ ప్రాంతంలో ఫర్నీచర్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.