Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి - ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2023 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్లో సాధించిన మెరిట్ ఆధారంగా బీఈడీ రెగ్యులర్ కోర్సు, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రామ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ/ ప్రయివేట్/ ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ బీఎస్సీ(హోం సైన్స్)/ బీకాం/ బీసీఏ/ బీబీఎం ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అర్హులే. సంబంధిత సబ్జెక్టులో పీజీ/ సంబంధిత మెథడాలజీలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పూర్తిచేసినవారు; కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అలైడ్ మెటీరియల్ సైన్సెస్, అలైడ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.