Authorization
Tue April 29, 2025 05:05:46 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని చెరుకుపల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భవనం గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా కుప్పకూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. పక్కనున్న మూడు భవనాలపై శిథిలాలు పడటంతో గోడలు దెబ్బతిన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కూలిన భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.