Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఈరోజుతో మొదలు కానుంది. దాంతో, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు టోర్నీకి దూరమైన ఆటగాళ్ల ప్లేస్‌లో మరొకరిని తీసుకున్నాయి. ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో యంగ్ పేసర్ సందీప్ వారియర్ ను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో అభిషేక్ పొరెల్‌ను ఎంపిక చేసింది.
పేసర్ సందీప్‌ది కేరళ. దేశవాళీలో కేరట, తమిళనాడు జట్లకు ఆడిన ఇతను 2021లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. అయితే టీమిండియా తరఫున ఒకే ఒక టీ20 మ్యాచ్ (శ్రీలంకపై) ఆడాడు. గత సీజన్లో సందీప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు అతను 68 టీ20లు ఆడాడు. ఢిల్లీ యాజమాన్యం రిషభ్ పంత్ స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్‌ను తీసుకుంది. పంత్ ప్లేస్ కోసం షెల్డన్ జాక్సన్, లవ్‌నీత్ సిసోడియా, వివేక్ సింగ్, అభిషేక్ మధ్య పోటీ నెలకొంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో వీళ్ల కీపింగ్ స్కిల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరభ్ గంగూలీ పరిశీలించారు. దేశవాళీలో బెంగాల్ తరఫున రాణించిన అతడిపైనే నమ్మకం ఉంచారు.