Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) దూకుడు పెంచింది. టీఎస్పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలను సిట్ అధికారులు విచారించనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్లను కూడా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) నిర్ణయించింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. టీఎస్పీఎస్సీ ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేశ్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించి పేపర్ లీకేజీతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్, సురేశ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి సిట్ కార్యాలయానికి తరలించారు. ముగ్గురు నిందితులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.