Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక్కోసారి విహారయాత్రలు విషాద యాత్రలుగా మారతాయి. ఈత సరదా ప్రాణాలు తీస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి ఈతకు వెళ్ళి దుర్మరణం పాలయ్యాడు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పేలూరి సాయిదుర్గ (16) కోదండ రామ కోనేరులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గజఈతగాళ్లు సహాయంతో కోనేరులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉండటంతో తోటి విద్యార్థులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొట్టి చంపి కోనేరులో పాడేసి ఉంటారని భావిస్తున్నారు. విద్యార్థి ఒంటి పై రక్తపు గాయాలు ఉండటంతో తన కుమారుడిది హత్యనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో వున్నా తమ పిల్లవాడిని తరగతి విద్యార్థులు వచ్చి తీసుకువెళ్లి చంపేశారు అంటూ ఆరోపిస్తున్నారు జి. మామిడాడ హైస్కూల్ వద్ద మృతదేహంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు అందోళన చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు మృతుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.