Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16 అరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణిత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ కు 179పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ గైక్వాడ్ (50 బంతుల్లో 72) పరుగులు చేశాడు. మోయిన్ అలి (23), దుబ్ (19) పరుగులు చేయగా చివర్లో కెఫ్టెన్ ధోని 7 బంతుల్లో 14 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించింది. గుజారత్ బౌలర్లలో షమి, రషీద్ ఖాన్, జోసేఫ్ రెండేసి వికెట్లు తీయగా లిటిల్ ఒక వికెట్ తీశాడు.