Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం అయిదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది. కొత్త ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 పెంచినట్లు తెలిసింది. ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్‌లో రూ.20 టోల్ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్‌ప్లాజా మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. వీటికి కూడా మరో రూ.4 పెంచారు.