Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 100 వికెట్ల సాధించిన బౌలర్ల ఎలైట్ జాబితాలో షమీ చేరాడు. ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో డెవాన్ కాన్వేను ఔట్ చేసిన షమీ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో 19వ స్ధానంలో షమీ నిలిచాడు. అదే విధంగా ఈ రికార్డు సాధించిన 14వ భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఈ మైల్‌స్టోన్‌ను 94 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. షమీ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. 2013లో షమీ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.