Authorization
Wed April 30, 2025 05:33:35 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం కురిసింది. భద్రాచలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. యోగ నరసింహస్వామి దేవాలయంలో ధ్వజస్తంభంపై పిడుగు పడింది.