Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలో మెట్రో ప్రయాణికులకు కొత్త ఆఫర్‌ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఆఫ్ పీక్ అవర్స్ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. ఆఫ్ పీక్ అవర్స్ ఆఫర్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్స్(సీఎస్సీ)లపై 10 శాతం రాయితీ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు తిరిగి రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 57 మెట్రో స్టేషన్లతో కలిసి మొత్తం 69 కి.మీ మేర మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, ప్రతి రోజు 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నామరని ఆయన తెలిపారు.