Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఇటలీ: ప్రభుత్వ పింఛను కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారులను బోల్తా కొట్టించిన ఆమె ఓ చిన్న పొరపాటుతో దొరికిపోయింది. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 48 ఏళ్ల ఆ మహిళ తాను అంధురాలినంటూ 15 ఏళ్ల క్రితం వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది. సామాజిక భద్రత పింఛనుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె నిజంగానే అంధురాలు అని నమ్మిన అధికారులు పింఛను మంజూరు చేశారు. మొత్తంగా 15 ఏళ్లలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు.. (రూ. 1.8 కోట్లు) పింఛన్ రూపంలో కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా ఒక రోజు ఆమె తన సెల్ ఫోన్ను స్క్రోల్ చేయడం, ఫైళ్లపై సంతకాలు పెట్టడాన్ని అధికారులు గమనించారు. దీంతో ఆమె బండారం బయటపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆమెకు అంధురాలిగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వైద్యుడినీ విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.