Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పుట్టపర్తి
పుట్టపర్తి అభివృద్ధిపై టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరస్పర సవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల నారా లోకేశ్ పాదయాత్ర పుట్టపర్తిలో జరిగింది. ఈ సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని, లోకేశ్‌ను విమర్శిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పుట్టపర్తి అభివృద్ధి ఏ మేరకు చేశారో చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి వైసీపీఎమ్మెల్యేకు సవాలు విసిరారు. స్థానిక సత్తెమ్మ ఆలయం వద్ద చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో టీడీపీ కార్యాలయం గోడ దూకి పల్లె రఘునాథరెడ్డి హనుమాన్ జంక్షన్‌కు వెళ్లారు. అక్కడ ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పల్లె రఘునాథరెడ్డి కారును వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో పల్లె రఘునాథరెడ్డిని అరెస్టు చేశారు.