Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
జిల్లాలోని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు నిర్లక్ష్యం ప్రదర్శించాడు. గూడ్స్ రైలు కింద నుంచి అవతలి ప్లాట్‌ఫామ్‌కు చేరే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆ గూడ్స్ ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆ తాత రైలు కిందపడిపోయాడు. ఈ తరుణంలో తాత సమయస్ఫూర్తితో పట్టాల మధ్యే పడుకుండి పోయాడు. ఆ సమయంలో పక్కనే పట్టాల మధ్య ఓ వృద్ధురాలు ఆయనకి ఏమవుతుందో అనుకుంటూ రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు గూడ్స్ డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ఆయన రైలును ఆపేశాడు. ఆ వెంటనే పట్టాల మధ్య బొక్కబోర్లా పడుకున్న తాతను బయటకు లాగేశారు ప్రయాణికులు.