Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గూగుల్ ఖర్ఛులు తగ్గించుకునేందుకు ఉచితాలన్నిటినీ తొలగించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు ఓ నోటీసు అందినట్టు బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనంలో వెల్లడైంది. ఈ నోటీసులను సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రుత్ పొరాట్ స్వయంగా పంపించారట. ఈ ‘ఉచితాలు’ తాలూకు నిధులను ఇతర ప్రాధాన్యాలవైపు మళ్లించడమే తమ లక్ష్యమని తన లేఖలో స్పష్టం చేశారట. అంతేకాకుండా.. కొత్త నియామకాలను కూడా తగ్గించామని, ప్రస్తుతమున్న ఉద్యోగులనే హై ప్రయారిటీ పనులకు వినియోగించుకుంటామని చెప్పొకొచ్చారట. గూగుల్ కార్యాలయం ఏ ప్రాంతంలో ఉందనేదాన్ని బట్టి ఉచితాలకు కోతలు విధించనున్నారని సమాచారం.