Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందేభారత్ రైలు పరుగు పెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన నడిచే ఈ రైలు గమ్యస్థానాన్ని చేరుకోవటానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుందని సమాచారం. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో వందేభారత్ రైలు ఆగతుందని అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలని కిషన్రెడ్డి కోరారు.