Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం ముస్సోరీ-డెహ్రాడూన్ మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుషెర్గాడి ప్రాంతంలో అదుపుతప్పింది. రోడ్డు నుంచి లోయలోకి ఆ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు బాలికలు మరణించారు. బస్సు డ్రైవర్‌తో సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ నుంచి పైకి తీసుకొచ్చారు. లాండూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డెహ్రాడూన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ముస్సోరీ మార్గంలోని షెర్గాడి ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడిందని ముస్సోరీ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మరణించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు లోయలోకి దూసుకెళ్లిన బస్సుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.