Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుని ఇప్పటికీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తుంది. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరుకు వేణుపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. ఇటీవలే ఓటీటీలో విడుదలై మరింత ఆదరణ దక్కించుకుంది. పల్లెల్లో ఆరుబయట స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
బలగం సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పడింది. సుమారు రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.25 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక కమర్షియల్‌గానే కాదు అవార్డుల పరంగానూ బలగం సినిమా సత్తా చాటుతుంది. ఇటీవలే బలగం సినిమా రెండు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. కాగా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు(ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. దీనిపై చిత్రబృందం ఇదంతా ప్రేక్షకుల వల్లే సాధ్యమైందంటూ ట్వీట్ చేసింది.