Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బిహార్
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో హింసకు పాల్పడిన వారందరినీ తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. బిహార్‌లోని పలు జిల్లాల్లో ఇటీవల రామనవమి సందర్భంగా తలెత్తిన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఆదివారం అమిత్ షా బిహార్ పర్యటించారు. నవాదాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేను సాసారామ్ వెళ్లాలి. కానీ అక్కడ మనుషులు చనిపోతున్నారు. తుపాకులు మోగుతున్నాయి. అందుకే వెళ్లలేకపోయానన్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి సరిచేస్తాం’’ అని అన్నారు.
తన తనయుడు తేజస్వీ యాదవ్‌ను బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ చూడాలనుకుంటున్నారని, అలాగే నీతీశ్ కూడా దేశ ప్రధాని అవుతానన్న తప్పుడు భావనలో ఉన్నారని, వీరిద్దరి కలలూ నెరవేరవని అమిత్ షా తెలిపారు. ‘‘నీతీశ్ దేశ ప్రధానైతే బిహార్‌కు తన తనయుడు ముఖ్యమంత్రి అవుతాడని లాలూ భావిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే దేశ ప్రధాని పదవి ఖాళీగా లేదు. అక్కడ మూడోసారి మోడీయే ప్రధాని అవుతారు అని తెలిపారు.