Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పడకుండా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం పురపాలకశాఖ కూల్ రూఫ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023-28ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.
అయిదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. దీనికోసం రెండు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్న పురపాలకశాఖ ఎట్టకేలకు అమలుకు సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో 100 చ.కి.మీ. మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చ.కి.మీ. విస్తీర్ణంలో కూల్‌రూఫ్స్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ విధానం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని, కూల్ రూఫ్ వల్ల మీటర్ కు కేవలం రూ.300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గి ఆ మేరకు బిల్లు కూడా తక్కువ వస్తుందని, కూల్ రూఫ్ కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున శిక్షణ అందిస్తామని, రాష్ట్రంలో త్వరలో మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.