Authorization
Wed April 30, 2025 03:28:52 pm
నవతెలంగాణ - హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలకు సుమారు 9.40 లక్షల మంది హాజరుకానున్నారు. వారి హాల్టికెట్లను (అడ్మిట్ కార్డులు) సోమవారం వెబ్సైట్లో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు.