Authorization
Wed April 30, 2025 04:48:02 pm
నవతెలంగాణ - అమరావతి
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నంబరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. స్థానికులు , పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా దెందులూరు వద్దకు చేరుకునేసరికి ప్రమాదవశాత్తు బోల్తాపడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే దెందులూరు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని నాలుగు అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.