Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ విషయంపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదమంటూ మంత్రి ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపీ.. పేపర్ లీకేజీ కుట్రలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్.. అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.