Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు లో విషాదం చోటు చేసుకుంది. ట్యాంక్ లో పడి ఐదుగురు యువకులు మృతి చెందిన సంఘటన చెన్నై శివారులోని కీల్కట్టలై సమీపంలోగల మూవరసంపేట లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మలింగేశ్వర్ ఆలయంలో తీర్థవర్థి ఉత్సవాలకు వెళ్లిన 18 నుంచి 23 ఏండ్ల వయసున్న ఐదుగురు యువకులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో యువకుల మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మడిపాక్కంకు చెందిన రాఘవన్, కీల్కట్టలైకి చెందిన యోగేశ్వరన్, నంగనల్లూరుకు చెందిన వనేష్, రాఘవన్, ఆర్.సూర్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.