Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. టీమిండియాలో చోటు కోల్పోయిన షా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. మరో వైపు కష్టాలు పెరుగుతున్నాయి. క్రికెటర్‌పై ముంబయిలో కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ దాఖలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సప్నా గిల్ తన ఫిర్యాదులో ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన వైద్యుల రిపోర్ట్‌ను సైతం ఫిర్యాదుతో జత చేసింది. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద షాపై ఫిర్యాదు నమోదైంది. పృథ్వీషా, సురేంద్ర యాదవ్‌తో పాటు భగవత్ గారండేపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఈ నెల 17న విచారణ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌కు వెళ్లిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్, ఆమె స్నేహితులు ప్రయత్నించారు. మొదట ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా.. ఆ తర్వాత పదేపదే అడగడంతో నిరాకరించారు. దీంతో హోటల్ నుంచి వెళ్లిన తర్వాత క్రికెటర్‌ను వెంబడించి వాగ్వాదానికి దిగారని, తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని పృథ్వీషా ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సప్నా గిల్ సహా ఎనిమిది అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా గిల్ పృథ్వీషాపై కేసు పెట్టింది. ఈ సందర్భంగా పృథ్వీషాపై ఆరోపణలు చేసింది. సెల్ఫీ కోసం స్నేహితులు వెళితో గొడవపడ్డాడని.. తాను కలుగజేసుకొని మాట్లాడేందుకు వెళితే తనను అనుచితంగా తాకాడని, నెట్టాడంటూ ఆరోపించింది. మళ్లీ తాజాగా పృథ్వీ షాపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.