Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికుడికి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని కేంద్ర నిఘా బృందం, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) సంయుక్తంగా బుధవారం పట్టుకున్నాయి. రత్నగిరికి చేరుకున్న కేరళ పోలీసుల బృందానికి అతనిని అప్పగించాయి. నిందితుడిని దిల్లీలోని షహీన్బాగ్కు చెందిన షారుఖ్ సైఫీ(27)గా గుర్తించారు. ఆదివారం రాత్రి దాడి తర్వాత మహారాష్ట్రలోని రత్నగిరికి చేరుకున్న నిందితుడు అక్కడ ఒక ఆసుపత్రిలో చేరి కాలిన గాయాలకు చికిత్స పొందాడు, బుధవారం పారిపోతుండగా రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడని ఏటీఎస్ అధికారి వెల్లడించారు. నేరానికి పాల్పడింది తానేనని షారుఖ్ సైఫీ అంగీకరించాడని, అందుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.