Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
సీఆర్పీఎఫ్లో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు సీఆర్పీఎఫ్లో 1.30 లక్షల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 1,29,929 ఉద్యోగాల్లో 1,25,262 పోస్టులకు పురుష అభ్యర్థులు, 4, 667 పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానాన్ని ఉత్తీర్ణులై ఉండాలి లేదా మాజీ ఆర్మీ సిబ్బందికి సమానమైన ఆర్మీ అర్హతను కలిగి ఉండాలి. పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.