Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని భైంసా సమీంలోని నాగదేవత ఆలయం వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను భైంసా దవాఖానకు తరలించారు. మృతిచెందిన బాలుడిన ఆదిత్యగా గుర్తించారు. షిర్డీ నుంచి భైంసా తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.