Authorization
Wed April 30, 2025 05:23:50 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగర శివార్లలోని మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటినతర్వాత కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థానికి చేరుకున్నారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.