Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బేగంపేటలో ఓ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం శంషాబాద్ నుంచి జెబిఎస్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు బెంగంపేటలో 9 గంటల ప్రాంతంలో మంటలు చేలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్కూట్తోనే మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.