Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం పదవ తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 11వ తేదీతో ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి. అనంతరం 13వ తేదీ నుంచి వాల్యుయేషన్ చేపట్టనున్నారు. ఈ వాల్యుయేషన్ ఈ నెల 21వ తేదీ వరకు అంటే... మొత్తం 9 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఏడాది పదవ పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించడంతో ఆ మేరకు స్పాట్ వాల్యుయేషన్ కూడా త్వరగానే ముగియనుంది. ఈ వాల్యుయేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో మొత్తం 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు.