Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల
తిరుపతి ఆలయంలో అరవింద్ నేత్రాలయంలో ఐ బ్యాంకు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అన్నదానంలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామన్నారు. సుదర్శనం సత్రాల స్థానంలో నూతన అతిధిగృహలను నిర్మిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు.
మార్చి మాసంలో 20లక్షల 57వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించిందని ధర్మారెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా కోటి 2లక్షల లడ్డులను భక్తులకి విక్రయించామని తెలిపారు.