Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు చంపుతామంటూ వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. గత నెల 19న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. దీంతో తన స్వీయ భద్రతపై దబాంగ్ స్టార్ దృష్టిసారించాడు.
ఈ తరుణంలో అత్యాధునిక హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ ఎస్యూవీని సల్మాన్ కొనుగోలు చేశాడు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అయిన నిస్సన్ పెట్రోల్ ఎస్యూవీ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. అయితే దేశంలో ఈ కారును నిస్సన్ కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. దక్షిణాసియా మార్కెట్లో మోస్ట్ పాపుల్ ఎస్యూవీ అయిన ఈ కారు అత్యంత ఖరీదైనది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులు, దాదాపు 10 మంది కానిస్టేబుళ్లు నిత్యం విధుల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. బాంద్రా శివారులోని సల్మాన్ నివాసం, ఆఫీస్ వెలుపల అభిమానులకు గుమిగూడే అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.