Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలోని దరియాగంజ్‌లో ఉన్న ఓ పబ్లిక్ టాయిలెట్లో సుమారు 50 లీటర్ యాసిడ్‌ను గుర్తించారు. ఢిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మాలివాల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీ సమయంలో యాసిడ్ విషయం బయటపడింది. గురువారం రాత్రి నిర్వహించిన ఆ తనిఖీకి చెందిన వీడియోను స్వాతి తన ట్విట్టర్లో సేర్ చేశారు. పబ్లిక్ టాయిలెట్ లో ఇంత మొత్తంలో యాసిడ్ ఉండడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ యాసిడ్‌తో ఎంత మంది జీవితాలు నాశనం అయ్యేవాని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల్ని పిలిపించి ఆ యాసిడ్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలో ఎంసీడీ నుంచి వివరణ కోరుతున్నట్లు ఆమె తెలిపారు.