Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణకు మరో 5 జాతీయ అవార్డులు వచ్చాయి. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు తోడుగా, తాజాగా మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహ్రా ప్రకటించారు. దీంతో కేంద్రం ప్రకటించిన పుసర్కారాలలో మొత్తం 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేస్తామని, సంబంధిత ప్రతినిధులను ఒక రోజు ముందుగా పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణకు వరించిన నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ఇవే..
- ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండీ
- ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా
- స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో… గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం
- కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం
- నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికేట్ల విభాగం – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కారానికి సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి ఎంపికైంది.