Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ ప్రారంభించనున్న నేపథ్యంలో 10వ నంబర్ ప్లాట్ ఫాంను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు. 10వ ప్లాట్ ఫాం సైడ్ ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్, క్యాటరింగ్ స్టాల్స్, వెయిటింగ్ హాల్స్‌ను కూడా మూసివేయనున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవన్నీ మూసి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమయంలో ప్లాట్ ఫాంపైకి ప్రయాణికులను ఎవర్నీ అనుమతించమని చెప్పారు. 10వ ప్లాట్ ఫాం వైపు ఉండే టూ, ఫోర్ వీలర్ పార్కింగ్స్‌ను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.