Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భిక్కనూర్
ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన భిక్కనూర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లేశం ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నిప్పు అంటుకుంది. దీనిని గమనించిన కుటుంబీకులు, స్థానికులు నిప్పు ఆర్పె ప్రయత్నం చేసిన మంటలు ఆరకపోవడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్స్ స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో 4 తులాల బంగారం, 50 తులాల వెండి, 42 వేల రూపాయల నగదు, వంట సామాగ్రి బట్టలు సుమారు లక్ష యాభై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ స్పందించి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబీకులు, స్థానికులు కోరారు.