Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సుమారు రెండు గంటలసేపు నగరంలో పర్యటించనున్న ప్రధాని రూ.11 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని కార్యక్రమాల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. బహిరంగసభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కూడా షెడ్యూలులో చేర్చారు. కానీ ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ప్రకటించారు. ప్రధానికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వాగతం పలకనున్నారు.
ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్యనేతలతో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.