Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలు,విద్యాసంస్థలు కేటాయించని మోడీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదు.
- ఎస్ఎఫ్ఐ -డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గో బ్యాక్ మోడీ అంటూ నల్ల బెలూన్లతో నిరసన, ప్రదర్శన
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థలు ,ఇస్తానన్న 2 కోట్లు ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ విద్యార్ధి, యువజనులను మోసం చేసిన మోడీ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని ఎస్ఎఫ్ఐ -డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గో బ్యాక్ మోడీ అంటూ మోడీ పర్యటనను నిరసనగా నల్లబెలూన్లు ఏగరవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఎం.డి.జావేద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ లు మాట్లడారు. వారు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ రేటు పెరిగింది. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని వారన్నారు.ఉద్యోగాలు సంగతి ఎందో మోడీ మాట్లడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రనికి రావాల్సిన విభజన హామీలను తుంగలో తొక్కి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఈ 8 యేండ్ల కాలంలో ఒక్క ఉన్నత విద్యాసంస్థ కూడా తెలంగాణకు కేటాయించలేదని వారు అన్నారు. జిల్లాకో నవోదయ విద్యాలయం, నర్సింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు కేటాయించాల్సిన ఈ విద్యాసంస్థలను కేటాయించలేదు. ఐఐటీలు, ఐఐఎం, గిరిజన,హర్టీకల్చర్ యూనివర్శీటీలు,ఏర్పాటు చేయలేదు. తెలంగాణ విద్యార్ధి,నిరుద్యోగులకు ఉద్యోగాలను సృష్టించే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉసే లేదు. ఈ హామీలు అమలు చేయకుండా టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్న ప్రధాని తెలంగాణపై చిన్న చూస్తున్నారని అందుకే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే హక్కు మోదీకి లేదని చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని ధ్వంసం చేయడం, చరిత్ర పాఠాలు నుండి విప్లవకారులు,జాతీయోద్యమ వీరుల చరిత్రను మార్పుచేస్తున్నారని,అన్నారు. యూనివర్శీటీలకు నిధులు తగ్గించి దళిత, ఆదివాసీ, గిరిజన, బిసి విద్యార్ధులకు ఇచ్చే ఫెలోషిప్స్ ఇవ్వడం లేదు. మైనారిటీ విద్యార్ధుల స్కాలర్ షిప్స్ రద్దు చేశారు. ఈ అంశాల పట్ల బిజెపి, మోడీ సమాధానం చెప్పాలన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 10 వ తరగతి పేపర్ బయటకు తీసుకుని వచ్చిన దానిపై విద్యార్ధుల భవిష్యత్ నష్టం చేసిన అంశంపై ప్రధాని మాట్లడాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై నోరు విప్పకుండా తెలంగాణ వచ్చి ఎం మాట్లడతారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు లెనిన్ గువేరా, కె.అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షులు హాస్మీబాబు డివైఎఫ్ఐ మాజీ నాయకులు కోమ్ము విజయ్, పవన్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వీరేందర్, శ్రీమాన్, స్టాలిన్ ,కిరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.