Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. తారానగర్‌లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి మృతి చెందాడు.
పొరపాటున ఆ లిక్విడ్‌ను తాగేశాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని అబ్బూ జాకీర్‌గా పోలీసులు గుర్తించారు.