Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సాధారణంగా వేసవిలో పిల్లలకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు బడులను ఒంటిపూటే నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించింది పంజాబ్ సర్కారు. వచ్చే నెల నుంచి ఒంటిపూట ఆఫీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం ఈ కీలక ప్రకటన చేశారు. పంజాబ్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. అయితే మే 2వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 వరకు ఈ కొత్త పనివేళలు అమల్లో ఉంటాయని సీఎం భగవంత్ మాన్ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.